
బచ్చన్నపేట, వెలుగు : పేదలకు మేలు చేసేందుకే తన పదవిని ఉపయోగిస్తానని బీఆర్‌ఎస్ జనగామ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. జనగామ జిల్లా బచ్చన్నపేటమండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తానని చెప్పారు. గ్యాస్ ధర తగ్గించలేని కేంద్రం దేశ సంపదను మాత్రం ఆదానీ, అంబానీలకు దోచిపెడుతోందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రూ. 400లకే సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, సర్పంచ్ వేముల వెంకట్‌గౌడ్, సుంకెలక్ష్మి, పంజాల తార, కీసర లక్ష్మి, నరెడ్ల బాల్‌రెడ్డి, నాయకులు బొడిగం చంద్రారెడ్డి, బి.కృష్ణంరాజు, చల్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.