జనగామలో గెలిచి కేసీఆర్‌‌కు గిఫ్ట్‌‌ ఇస్తా : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు : జనగామ అసెంబ్లీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌‌కు గిఫ్ట్‌‌గా ఇస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు.  గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాలకు వెళ్తున్న పల్లా మార్గమధ్యలో జనగామ జిల్లా బచ్చన్నపేటలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం బీఆర్‌‌ఎస్‌‌ సొంతమన్నారు. గతంలో కంటే అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.


ALSO READ: తెలంగాణను కేసీఆర్​ కుటుంబం దోచుకుంది : మంత్రి శోభా కరంద్లాజే
 

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట రైతుబంధు జనగామ జిల్లా కన్వీనర్‌‌ ఇర్రి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్, మండల, పట్టణ శాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నరేందర్, కోఆప్షన్‌‌ సభ్యుడు షబ్బీర్ ఉన్నారు.