
జనగామ/ చేర్యాల, వెలుగు : లోకల్.. నాన్ లోకల్కాదు.. అభివృద్ధిలో పోటీ పడాలె.. నేనూ ఇక్కడి వాడినేనని.. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గాన్ని కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం చేర్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..- ఎన్నికల్లో గెలిపిస్తే నెల రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఒక నియోజవర్గానికి ఒకేసారి వస్తడు కానీ ఈనెల 18న కేసీఆర్ మరోసారి చేర్యాలకు వస్తున్నారంటే ఇక్కడి ప్రాంతం పై సీఎంకు ఉన్న ప్రత్యేక ప్రేమనే కారణమన్నారు.
చేర్యాల సమగ్రాభివృద్ధికి సరిపడా నిధులు కేసీఆర్ను అడిగి తీసుకుందామన్నారు. పట్టణాన్నిమరింత సుందరీకణ చేస్తానన్నారు. ఇప్పుడిచ్చిన రూ.10 కోట్ల నిధులు సరిపోకుంటే మరిన్ని నిధులు తెచ్చి అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం వంగపల్లి జీపీ పరిధి ఉప్పరోని గడ్డకు చెందిన 30 మంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మల్లేశం గౌడ్, కౌన్సిలర్లు చంటి, నరేందర్, జుబెడా ఇక్బాల్, కనకమ్మ, సతీశ్గౌడ్, నాగేశ్వర్ రావు, బాలనార్శయ్, శ్రీరాములు, సిద్ధయ్య పాల్గొన్నారు.