రైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటు

రైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. గతంలో యూపీలో రైతులను కార్లతో తొక్కి  చంపించారని... ఇప్పుడు రైతులపై రాళ్ల దాడి చేశారన్నారు. బీజేపీకి పాలసీ ఉంటే దేశం అంతా ఒకే విధానం ఎందుకు లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్ల పై స్పష్టం చేయాలన్నారు. నల్గొండలో రైతుల పై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు.  రైతులపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలన్నారు.  ధాన్యం కొంటారా లేదా అనే అంశంపై కేంద్రం లేఖ విడుదల చేయాలన్నారు.  బీజేపీ తన పాలసీ చెప్పే వరకు బయట తిరగనియ్యమన్నారు.  వానాకాలం పంటను మొత్తం కొనాలని.. యాసంగిలో వరి వెయ్యాలా వద్దా కేంద్రం చెప్పాలన్నారు.