
జనగామ బీఆర్ఎస్ లో విభేదాలు రచ్చ కెక్కాయి. అసెంబ్లీ టికట్ కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులు వార్ జరుగుతోంది. ఈ క్రమంలో పల్లాకు వ్యతిరేకంగా జనగామ చౌరస్తాలో ముత్తిరెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ముత్తిరెడ్డి గో బ్యాక్ అంటూ పార్టీ జెండాలతో పాటు, నల్లజెండాలు, ప్లకార్డులతో భారీ ర్యాలీ చేపట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. మూడోసారి కూడా ముత్తిరెడ్డిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం కరెక్ట కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముత్తిరెడ్డి వల్లే జనగామ అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.
అయితే పల్లా ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే రాజేశ్వర్ రెడ్డి జనగామపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే లోకల్ లీడర్లతో టచ్‌లోకి వెళ్లిన పల్లా, ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపినట్లు స్పష్టమవుతున్నది. మూడురోజుల క్రితం పల్లా తన సొంతూరు లో వేసిన స్కెచ్‌తో సీన్ కాస్తా హైదరాబాద్‌లోని హరిత ప్లాజా హోటల్‌కు మారింది. బుధవారం నాటి హైడ్రామా తర్వాత తీవ్ర ఆందోళనతో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్అనుమానంగానే కనిపిస్తున్నది. ఆయనకు బదులు జనగామ నుంచి పల్లాకు టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.