నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ బండి సంజయ్ ని హెచ్చరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బండి సంజయ్ దేశ ద్రోహి అని.. చట్టాలను ఉల్లంగిస్తున్నాడన్నారు. బండి సంజయ్ సవాల్ విసరాలనుకుంటే చార్మినార్ టెంపులే దొరికిందా.. వేరే గుడులు లేవా అని ప్రశ్నించారు. గెలిస్తే ఇంటికి
రూ. 25 వేలు ఇస్తామంటున్న బీజేపీ నేతలు వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. వరద సాయం ఆపాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి, లెటర్ ఇచ్చింది వాస్తవమన్నారు. బీజేపీ కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రం నుంచి నిధులు తేవాలన్నారు. బీజేపీ నేతలు మాట్లాడే తీరు వారి సంస్కృతికి అద్దం పడుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిసిలకు 75,ఎస్సీ13,ఎస్టీలకు 3 సీట్లు ఇచ్చామన్నారు. కొన్ని జనరల్ సీట్లను కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామన్నారు.