చౌటుప్పల్ వెలుగు: పొత్తులో భాగంగా మునుగోడు అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి కాంగ్రెస్‌ను కోరారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మతతత్వ పార్టీ అయిన బీజేపీని గద్దె దింపేందుకు సీపీఐ, సీపీఎం ఇండియా కూటమిలో చేరాయన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్‌లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.
సీపీఐ నుంచి కొత్తగూడెం, మునుగోడు, చెన్నూరు, హుస్నాబాద్, సీట్లను అడిగామని, కాంగ్రెస్ హైకమాండ్ ఇందులో రెండు స్థానాలు ఇచ్చేందుకు అవగాహన కుదిరిందన్నారు. అయితే కొత్తగూడెం, మునుగోడును తాము అడగగా.. కొత్తగూడెం, చెన్నూరు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. దీనిపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని చెప్పారు.