
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో బుధవారం రాత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన దుర్గ భవానీ పల్లకీ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ప్రతిష్టించారు. అనంతరం ఆలయ చైర్మన్ బాలా గౌడ్ ప్రత్యేక పూజలు చేసి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజగోపురం మీదుగా ఈశ్వరాలయం వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు వెంకటేశం, మనోహర్, రఘువీర్, మోహన్ రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.