తెలుగు బిగ్ బాస్(Bigg boss) సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజలు తనకు అండగా ఉంటే తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని, యువత ముందడుగు వేస్తేనే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ కామెంట్స్ కు నటుడు శివాజీ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయ్యాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఓ సినిమా ఈవెంట్ హాజరయ్యారు పల్లవి ప్రశాంత్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎం సాధించాలన్నా మనపై మనకు నమ్మక ఉండాలి. అలాగే ఆ దేవుడిపై కూడా. ఆయన్ని నమ్మినవారు ఎప్పటికీ చెడిపోరు. మన ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి, అడ్డంకులు వస్తాయి. అలాంటివి ఎన్ని వచ్చినా ధైర్యంగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. ఇపుడు మీ ముందు ఇలా నిలబడ్డాను. రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు.. అంటూ పల్లవి ప్రశాంత్ చెప్తుండగా.. మధ్యలో నటుడు శివాజీ మాట్లాడుతూ.. పార్లమెంట్ కు కూడా వెళ్తాడు అని అన్నారు.
ALSO READ :- Chiru gift to Trisha: విశ్వంభర సెట్లో త్రిష.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరు
దానికి పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ.. నిజమే.. మీ ఆశీస్సులు, అందండలు ఉంటే అది కూడా జరగొచ్చు. అందుకోసం యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది.. అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తానూ చెప్పినట్టుగానే ప్రజల సపోర్ట్ ఠీ పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.