- ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఓనర్
- కోపంతో బీఆర్ఎస్ లీడర్ నిప్పు పెట్టించాడని ఆరోపణలు
గద్వాల, వెలుగు : గద్వాల మండలం మేళ్లచెరువు గ్రామంలో గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఓ కల్లు దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఊరిలో ఇల్లీగల్ గా కల్లు షాపు నిర్వహిస్తున్న వ్యక్తులే ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గద్వాల జిల్లాలోని మేళ్లచెరువులో రెండు కల్లు దుకాణాలుండేవి. ఇందులో లైసెన్స్ఉన్న షాపు రామచంద్రయ్య గౌడ్ పేరు మీద ఉంది.
పర్మిషన్ లేని మరో షాపు బీఆర్ఎస్ లీడర్ దే కావడంతో ఇద్దరూ కలిసి ఏ గొడవలు లేకుండా నిర్వహించుకునేవారు. అయితే, ఎన్నికలకు ముందు రాంచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి ఆయన ఒక్కడే సొంతంగా తన షాపు నడుపుకుంటున్నాడు. తమను కాదని కాంగ్రెస్లో చేరడమే కాకుండా సొంతంగా షాపు నిర్వహించుకోవడంపై సదరు బీఆర్ఎస్ లీడర్ఆగ్రహం పెంచుకున్నాడు. ఆ అక్కసుతోనే లీగల్కల్లుషాపును తగలబెట్టించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కంప్లయింట్ అందిందని, ఎంక్వయిరీ చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు.