
ఎస్ఎస్డీపీ ఉద్యమం కేరళలో 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. ఎఝువ/ ఇరువ కుల సమస్యలు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు చేసింది. ఈ కులస్తులను బహిరంగ ప్రదేశాల నుంచి తరిమివేశారు. వీరికి ఆలయ ప్రవేశం సైతం లేకపోవడం వంటి సామాజిక వెలిని ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమం నారాయణగురు (నాన్ అసన్) ఆధ్వర్యంలో జరిగింది. ఈయన అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండిస్తూ జాతి మీమాంస అనే వ్యాసాన్ని రాశారు. నారాయణగురు అనుచరులను నియోబుద్ధిస్టులు అంటారు. వీరు ఏర్పాటు చేసిన సంస్థ నారాయణ ధర్మ పరిపాలన. (అరువిపురం)
- ఈ ఉద్యమం కేవలం ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదాన్ని ఇచ్చింది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనోద్యమం ముఖ్య లక్ష్యంగా సామాజిక మార్పును తీసుకురావడం, నైతిక సూత్రాలను ప్రచారం చేయడం అనేవి ఉండేవి.
- వీరి మొదటి సమావేశం 1903లో త్రివేండ్రం సమీపంలోని కన్నుకుజిలో కమలాలయం బంగళాలో నిర్వహించారు. ఇందులో పల్పు, కుమారన అసన్ పాల్గొన్నారు. దీనిలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనోద్యమం(ఎస్ఎన్డీపీ) పేరు ప్రతిపాదించారు. ఎస్ఎన్ డీపీ స్థాపకుడిగా పల్పు, మొదటి అధ్యక్షుడిగా శ్రీ నారాయణ గురు (1928 వరకు), మొదటి కార్యదర్శిగా కుమారన్ అసన్ లు పనిచేశారు.
- ఈ సంస్థ ఏర్పాటుకు వివేకానంద దివ్యసందేశం పునాదిగా పనిచేసింది. అరువిపురంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న వవుత్తు సభను ఎస్ఎన్ డీపీ యోగం కమిటీగా ఏర్పర్చారు.
- క్విలాన్ లో జరిగిన సమావేశంలో ఎస్ఎన్ డీపీలో ఎఝవా కులంతోపాటు, ఇతర వెనుకబడిన కులాలను కూడా చేర్చుకోవాలని శ్రీ అయ్యప్పన్ ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయ్యప్పన్ నో గాడ్, నో రెలిజియన్, నో క్యాస్ట్ అనే భావనను ప్రచారం చేశారు.