ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత చండూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రస్తుతానికి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. అలాగే నారాయణపురం మండలం బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.

నారాయణపురం మండలం లింగవారిగూడెంలో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమన్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.కొంత మంది కావాలనే డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు బైపోల్ ను రద్దు చేసుకుందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.