కాంగ్రెస్ పార్టీదే విజయం: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నికలో తమదే విజయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మంచి తీర్పు ఇస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. పోలింగ్ కూడా రాత్రి 10 గంటల వరకు జరిగిందన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎ

ఎన్నిక ప్రచార సమయంలో మహిళలు, యువత నుంచి తనకు మంచి స్పందన లభించిదని పాల్వాయి స్రవంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం ఉందని చెప్పారు.  అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడ్డాయని అన్నారు.