రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారిండు : పాల్వాయి స్రవంతి

 రాజగోపాల్ రెడ్డి  సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారిండు : పాల్వాయి స్రవంతి

పాలకుల నిర్లక్ష్యంతోనే మునుగోడు అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం తనతోనే ఉందని తెలిపారు. పాల్వాయి బిడ్డగా తనకు ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

నవంబర్ 3న మునుగోడుకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లుగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 6వ తేదిన కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఈసీ వెల్లడించింది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బరిలో ఉన్నారు. ఈ ఉపఎన్నిక పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.