మునుగోడుకు సంబంధించి కొత్త ఓటరు నమోదు ప్రక్రియలో బీజేపీ, టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడ్డాయని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. దీనిని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎక్కువ దరఖాస్తులు రావడం వెనుక బీజేపీ , టీఆర్ఎస్ల కుట్రలున్నాయని అన్నారు.
ఆరు నెలల క్రితమే ఓటర్ లిస్టు ప్రకటించారని పాల్వాయి స్రవంతి తెలిపారు. అధికారులు బీజేపీ, టీఆర్ఎస్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్పందించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కోరారు.