టీఆర్ఎస్, బీజేపీలు అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నాయని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. హైదరాబాద్ మన్నెగూడలోని వేదా కన్వెన్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ ఓటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వాయి స్రవంతి మాట్లాడారు.
ఆత్మాభిమానం పేరుతో మునుగోడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని స్రవంతి విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడున్నాడో..ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు.. ఎందుకు కౌరవ సైన్యాన్ని దించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.