మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్‌.. పాల్వాయి స్రవంతి రాజీనామా

మునుగోడులో కాంగ్రెస్‌కు మరోషాక్‌ తగిలింది. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం లేదా ఆదివారం (నవంబర్ 11 లేదా నవంబర్ 12 ) అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరనున్నట్లు వెల్లడించారు.

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని ప్రకటించడంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల స్వయంగా పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఎన్నిక బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిగా నిలిచారు.