వరదల్లో అన్నీ కోల్పోయా... ఇక నేనుండలేను.. గోదారిలో దూకిన పాల్వంచ కానిస్టేబుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  విషాదం చోటుచేసుకుంది.  పాల్వంచకు చెందిన రమణారెడ్డి అనే కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో తీసి భద్రాచలం గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు.  బ్రిడ్జి మీద చెప్పులు,సెల్ ఫోన్ వదలి పెట్టాడు కానిస్టేబుల్.
 
తన ఆత్మహత్యకు గల కారణాలను  కానిస్టేబుల్  రమణా రెడ్డి సెల్పీ వీడియోలో తెలిపాడు.  వరదల్లో నా తండ్రీని  ఇల్లును  ఆస్తి కోల్పోయాను.  మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను.  నాకు కార్ యాక్సిడెంట్ జరిగిన నాటి నుంచి రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. నా భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.  నేను ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తాను. నన్ను క్షమించండి. అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు కానిస్టేబుల్.  సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృత దేహాం కోసం గాలిస్తున్నారు.

ALSO READ | ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ..అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు