పోలీసుల కుటుంబాలకు హెల్త్ క్యాంపు : డీఎస్పీ సతీశ్​ కుమార్

పాల్వంచ,వెలుగు : విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసుల ఆరోగ్య రక్షణపై పోలీస్​ శాఖ దృష్టి పెట్టిందని పాల్వంచ డీఎస్పీ సతీశ్​ కుమార్ అన్నారు. బుధవారం పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలోని దమ్మపేట, అశ్వరావుపేట, ములకలపల్లి, పాల్వంచ రూరల్, బూర్గంపాడు, పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు కుటుంబాలకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డివిజన్​లోని సుమారు 120 పోలీసు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. 

నేత్ర పరీక్షలు, ఆర్థోపెటిక్, యూరాలజీ, ఫిజియో థెరపీ తదితర పరీక్షలు చేయించుకున్నారు. స్థానిక లయన్స్ క్లబ్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతృత్వంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ ఇన్​స్పెక్టర సంపత్ కుమార్, పాల్వంచ, అశ్వారావుపేట సీఐలు వినయ్ కుమార్, కరుణాకర్, ఎస్సై లు సుమన్, సురేశ్, రాజశేఖర్, రాజేశ్, రాజు జీవన్ రాజు, నాగభిక్షం, డాక్టర్లు ముక్కంటేశ్వరావు, యుగంధర్ రెడ్డి, రామ్మోహన్ రావు, సోమరాజు దొర, కిరణ్ కుమార్, సురేశ్ పాడ్య పాల్గొన్నారు.