సాంబారులో బల్లి.. గురుకులంలో కలకలం

పాల్వంచ, వెలుగు: పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల కాలేజీ కిచెన్ లో సాంబార్​లో బల్లి పడిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి వి ద్యార్థినులకు భోజనం వడ్డించేందుకు సిబ్బంది వేడి సాంబార్ తీసుకొచ్చి హాలులో పెట్టారు. ఈ క్రమంలో అనుకోకుండా సాంబర్ లో బల్లి కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థినులు భోజనం చేయడంతో అనుమానం వచ్చిన గురుకులం నిర్వాహకులు 25 మందిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించి తీసుకెళ్లారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదకరం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.