
పాల్వంచ, వెలుగు : పట్టణంలో తాగునీరు, పారిశుధ్యం విభాగాల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోననిపా ల్వంచ మున్సిపల్ కమిషనర్ కొడారు సుజాత హెచ్చరించారు. ఆదివారం మార్కెట్ ఏరియాలో పారిశుధ్య పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పట్టణంలో డ్రైనేజీ లు, రహదారులు ఎప్పుడు శుభ్రంగా ఉండాలని సూచించారు.
కరకవాగులోని ఫిల్టర్ బెడ్ తో పాటు పలు ప్రాంతాల్లో కుళాయిల్లో నీటి సరఫరా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పైపులైన్లకు రిపేర్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ పారిశుధ్య, నీటి సరఫరా సిబ్బంది, అధికారులు ఉన్నారు.