పోషకాహారంతోనే ఆరోగ్యం : పమేలా సత్పతి

 పోషకాహారంతోనే ఆరోగ్యం : పమేలా సత్పతి
  • కరీంనగర్​ కలెక్టర్​ పమేలా సత్పతి

గంగాధర, వెలుగు :పోషకాహారంతోనే మహిళలకు ఆరోగ్యమని కరీంనగర్​ కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం పెద్ద ఆచంపల్లిలో శుక్రవారం నిర్వహించిన సభకు ఆమె హాజరై మాట్లాడారు.  గర్భవతులు, బాలింతలు, తల్లులకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. 

తల్లులు, పిల్లలు రక్తహీనతకు గురికాకుండా ఉండాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఖర్జూర, బెల్లం, పల్లీలు, నువ్వులు వంటి బలమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు.  ప్రైవేట్​ హాస్పిటల్స్​కు ఎవరూ వెళ్లకూడదని, ప్రతి ఒక్క గర్భవతి ప్రభుత్వ హాస్పిటల్​లోనే డెలివరీ చేయించుకోవాలన్నారు. 

అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించి ఫ్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్​దేశాయ్, డీడబ్ల్యూవో సరస్వతి, గంగాధర మండల స్పెషలాఫీసర్ శ్రీనివాస్, సీడీపీవో కస్తూరి, ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీవో జనార్ధన్​రెడ్డి, నాయబ్​ తహశీల్దార్​ వినయ్ తదితరులు పాల్గొన్నారు.