కరీంనగర్ కలెక్టర్​గా పమేలా సత్పతి

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభిషేక్ మహంతి, జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పమేలా సత్పతిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వారు వెంటనే డ్యూటీలో జాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇంతకు ముందు ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీలపై పలు ఫిర్యాదులు రావడంతో వారిని బదిలీ చేస్తూ ఈ నెల 27న ఈసీ నిర్ణయం తీసుకుంది. 

ఈ క్రమంలో ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కొత్త సీపీ, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించేందుకు ముగ్గురి చొప్పున పేర్లు సూచిస్తూ సీఎస్ ప్యానల్ పంపింది. అందులో నుంచి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పమేలా సత్పతిని, పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభిషేక్ మహంతిని నియమించాలని ఈసీ ఆదేశించింది.