తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా ప్రెసిడెంట్​గా పంపరి శ్రీనివాస్

కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా ప్రెసిడెంట్​గా పంపరి శ్రీనివాస్​ నియమితులయ్యారు. రాజకీయ అనుభవంతో పాటు, గంగపుత్ర కుటుంబాలతో ఉన్న అనుబంధం దృష్ట్యా వీరి సంక్షేమానికి కృషిచేస్తారనే ఉద్దేశంతో జిల్లా ప్రెసిడెంట్​గా నియమించినట్లు స్టేట్ ​ప్రెసిడెంట్​ దీటి మల్లయ్య పేర్కొన్నారు.