జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పంపీణీ చేసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు అంటూ పాంప్లెట్లను న్యూస్ పేపర్లలో పెట్టి పంపిణీ చేశారు. ఈ కరపత్రాలపై ప్రింటర్ పేరు, నేతల హోదాలు లేవు. దీంతో పలు అనుమానాలకు తావిస్తుంది.
ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ వారు కరపత్రాలను పంపిణీ చేశారా?.. లేదంటే, బీజేపీ నేతలే ఆయనపై అసహనంతో పంపిణీ చేయించారా ? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.