ఈ నెల 28 నిజామాబాద్ లో జగన్నాథ రథయాత్ర

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ లో ఈ నెల 28 న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు రమానంద్ రాయ్ ప్రభుజీ, ఆది పురుష ప్రభుజీ, ఆర్మూర్ ప్రతినిధి నివేదన్ గుజరాతీ పేర్కొన్నారు. ఆర్మూర్ లో సోమవారం ఇస్కాన్ సెంటర్​ లో జగన్నాథ్ రత యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. 

ALSOREAD:గడపగడపకు బీజేపీతో పార్టీ బలోపేతం: ధన్​పాల్​ సూర్యనారాయణ

రథయాత్ర మధ్యాహ్నం రెండున్నరకు కంఠేశ్వర్ ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై పులాంగ్ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మంగళ హారతి, కీర్తన, అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ప్రతినిధులు చౌల్ దుర్గాప్రసాద్, నరేశ్, కొండల్వడి రాహుల్, సురేశ్, గోవర్ధన్, చందన్ నవీన్ పాల్గొన్నారు.