క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాన్​కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇకపై మరింత ఈజీగా బ్యాంక్ లోన్లు

క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాన్​కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇకపై మరింత ఈజీగా బ్యాంక్ లోన్లు
  • మరింత సులభంగా  బ్యాంకు లోన్లు
  • పాత కార్డులూ చెల్లుతాయ్​

న్యూఢిల్లీ: క్విక్​ రెస్పాన్స్​కోడ్​(క్యూఆర్ కోడ్) ఫీచర్‌‌తో పాన్ కార్డుల ఉచితంగా ఇవ్వడానికి  కేంద్రం రూ. 1,435 కోట్ల పాన్​2.0 ప్రాజెక్ట్‌‌ను ఆమోదించింది.   పాన్​ 2.0 ప్రాజెక్ట్ ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్‌‌ల కోసం "కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్"గా పనిచేస్తుంది.    ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబరే పాన్​కార్డు! క్యూఆర్ ​కోడ్ ​కార్డులు వచ్చినప్పటికీ  వ్యక్తులు,  వ్యాపారాల దగ్గర ప్రస్తుతం ఉన్న పాన్​ చెల్లుతుంది.  సంఖ్యను మార్చాల్సిన అవసరం ఉండదు. 

 పన్ను చెల్లింపుదారులు ఆన్‌‌లైన్‌‌లోనే తమ పాన్ కార్డుకు సంబంధించిన అన్ని సేవలను పొందవచ్చు. కొత్త పాన్ కార్డుల ద్వారా పన్ను చెల్లింపుదారుల సమాచారం మరింత సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  ‘‘కొత్త పాన్​ కార్డులను త్వరగా డెలివరీ చేస్తారు. యూజర్​ డేటా సురక్షితంగా ఉంటుంది. వ్యక్తులతోపాటు వ్యాపారాలకు ట్యాక్స్​ మేనేజ్​మెంట్​ను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పాత కార్డులు చెల్లుతాయి కానీ కొత్త వాటికి అప్​గ్రేడ్ ​కావడం మంచిది. వీటిలో డిజిటల్​ వెరిఫికేషన్​ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మనం బ్యాంకు లోన్​ కోసం వెళ్తే అక్కడి అధికారులు పాన్​ కార్డును స్కాన్​ చేయగానే మన ట్యాక్స్​ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. అక్కడే ఐడెంటిఫికేషన్ ​పూర్తవుతుంది. త్వరగా లోన్​ వస్తుంది. ట్యాక్స్​ఆడిట్​ త్వరగా అవుతుంది”అని ట్యాక్స్​స్పానర్​ సీఈఓ సుధీర్​ కౌశిక్​ అన్నారు.