వామ్మో.. Pantoprazole ట్యాబ్లెట్స్ పరిస్థితి కూడా ఇలా ఉందా..?

వామ్మో.. Pantoprazole ట్యాబ్లెట్స్ పరిస్థితి కూడా ఇలా ఉందా..?

ఢిల్లీ: భారత్లో అనారోగ్య సమస్యలకు వాడుతున్న కొన్ని ట్యాబ్లెట్లకు సంబంధించి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కీలక విషయాన్ని వెల్లడించింది. మన దేశంలో ఎక్కువగా వాడే 71 ట్యాబ్లెట్స్ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయినట్లు పేర్కొంది. 

ప్యాంట్యాబ్ డీ, షెల్కాల్ 500 ట్యాబ్లెట్లతో పాటు మన దేశంలో ఎక్కువగా వినియోగించే మరో 69 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ జాబితాలో దగ్గు మందు సిరప్లు, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని డయాబెటిస్ మెడిసిన్స్, కొన్ని బీపీ పిల్స్ కూడా ఉండటం గమనార్హం. 

Also Read :- లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ప్రధాన కారణాలివే

కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్లు, యాంటీ డయాబెటిస్ మాత్రలు, హై బీపీ టాబ్లెట్ తోపాటు మరో 50 కంటే ఎక్కువ గోలీలు భారతదేశంలో డ్రగ్ రెగ్యులేటర్ చేసే క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయని CDSCO(Central Drugs Standards Control Organisation) ఇప్పటికే హెచ్చరించింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) 53 టాబ్లెట్లను నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా (Paracetamol quality test fail) ప్రకటించింది. ఆగస్ట్‌లో CDSCO భారతీయ మార్కెట్‌లో 156 ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లను నిషేధించింది. ఇవి మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఈ మందులలో జ్వరం, నొప్పి నివారణ మందులు, అలెర్జీ మాత్రలు ఉన్నాయి.

విటమిన్ సి,డి ,షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డి, పారాసెటమాల్ ఐపి 500 ఎంజి, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హై బ్లడ్ ప్రెజర్ డ్రగ్ టెల్మిసార్టన్ వంటి అత్యధికంగా అమ్ముడుపోతున్న 53 రకాల ఔషధాలు డ్రగ్ రెగ్యులేటర్ టెస్ట్ లో Not of Standard Qualityలోకి చేరాయి.