సోషల్ మీడియాలో రకరకాల వంటకాలు వైరల్ అవుతుంటాయి. కాస్త డిఫరెంట్ గా ఉంటే చాలు నెటిజన్లు వాటిని ట్రై చేసేందుకు రెడీగా ఉంటారు. ఆమ్లెట్ కు సంబంధించిన వీడియోలు చాలానే వచ్చాయి. గతంలో పాప్‌కార్న్ ఆమ్లెట్, మ్యాంగో ఆమ్లెట్ వంటివి నెటిజన్లును ఆకట్టుకున్నాయి.
తాజాగా పాన్ మసాలా ఆమ్లెట్ అనేది ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. జైపూర్‌కు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ పాన్ మసాలా ఆమ్లెట్ వైరల్ గా మారింది. అయితే ఇది కోల్ కత్తాకు చెందిన ఫుడ్ గా తెలుస్తోంది.
ALSO READ :- నవంబరు 10 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
ఈ వంటకం వింతగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుడ్ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా దీనిని చూశారు. మీరు కూడా ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కింద ఈ వీడియోలో చూసేయండి.