పాన్ కార్డ్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. పాన్ 2.0 సిస్టమ్ ద్వారా పాన్ కార్డ్‌లోని అడ్రస్ని ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ అయ్యాక కొత్త ఇ–పాన్ రిజిస్టర్డ్ ఈ–మెయిల్‌కు వస్తుంది. ఫిజికల్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే.. యూజర్లు తమ గుర్తింపు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సేఫ్‌గా ఉంటుంది.
ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్‌లు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ఉండడం వల్ల నకిలీ పాన్ కార్డ్ అనేది ఉండదు. ఈ కోడ్‌ని నిర్దిష్ట సాఫ్ట్వేర్ అథారిటీ కలిగిన స్టాఫ్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. దీనివల్ల ఒరిజినల్ పాన్ నెంబర్ అలాగే ఉంచి, పేర్లు, ఫొటోగ్రాఫ్‌లను మార్చడానికి వీలుపడదు.
అప్డేట్ చేసిన పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫీచర్ ద్వారా అప్రూవ్ అవుతుంది. ఇందులో లోపాలు, మోసాలు జరగకుండా కాపాడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే యూజర్లకు ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు.