మౌంటెడ్ ఫ్రీజర్​తో పానాసోనిక్​ ఫ్రిజ్​లు

మౌంటెడ్ ఫ్రీజర్​తో పానాసోనిక్​ ఫ్రిజ్​లు

పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ మేడ్- ఇన్- ఇండియా రిఫ్రిజిరేటర్లను లాంచ్​చేసింది. ఇవి బాటమ్​ మౌంటెడ్ ఫ్రీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తాయి. ఫ్రీజర్ కంపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కింది భాగంలో ఉంటుంది. కూరగాయలను,  పండ్లను సులభంగా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

 కొత్త ప్రైమ్ కన్వర్టబుల్ బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 401, 357 లీటర్ల  కెపాసిటీతో వస్తాయి. ధరలు రూ.55,490 నుంచి మొదలవుతాయి. వీటితో పాటు 260 -లీటర్ ఫ్రాస్ట్-  ఫ్రీ రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.23,490 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లెక్సీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండబుల్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైమ్ ఫ్రెష్ జోన్  ఫ్రీజర్, 6 స్పీడ్​  ఇన్వెర్టర్ ​కంప్రెసర్​ వంటి సదుపాయాలు వీటి సొంతం.