జ్యోతిష్యం: ఏప్రిల్​ 25న మీనరాశిలో పంచగ్రహకూటమి.. మూడు రాశుల వారికి అదృష్టయోగం.. మిగతా రాశుల ఫలితాలు ఇవే..!

జ్యోతిష్యం: ఏప్రిల్​ 25న మీనరాశిలో పంచగ్రహకూటమి..  మూడు రాశుల వారికి అదృష్టయోగం.. మిగతా రాశుల ఫలితాలు ఇవే..!

 మీన రాశిలో మొత్తం ఐదు గ్రహాలు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచనున్నాయి.  ఇప్పటికే మీనరాశిలో శని , సూర్యుడు,  శుక్రుడు, రాహువు  బుధుడు ఉన్నారు.  ఏప్రిల్​ 25 వీరితో చంద్రుడు కూడా జతకట్టనున్నాడు. దీంతో మీనరాశిలో పంచగ్రహకూటమి ఏర్పడనుంది.  దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే మూడు రాశులకు(వృషభం.. కర్కాటకం.. సింహం)  మాత్రం లాభాలు తెచ్చిపెట్టనుంది.  ఈ మూడు రాశులతో పాటు మిగతా రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . 

 మేష రాశి :  మీనరాశిలోకి చంద్రుడు కలయిక.. పంచగ్రహకూటమి వలన ఈ రాశి  మిశ్రమ ఫలితాలుంటాయి.  మొదట్లో కొంత ఆందోళన కలిగినా చివరకు మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

వృషభ రాశి:  మీనరాశిలో పంచగ్రహ కూటమి.. చంద్రుడు .. శుకుడితో కలవడం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.  ఏప్రిల్ 25 నుండి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి.  పెండిగ్​ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది. జాబ్​ మారాలనుకొనే వారికి మంచి సమయం.   వృత్తి పనుల వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి.  ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి.  నిరుద్యోగులకు జాబ్​ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మిథున రాశి:  పంచగ్రహ కూటమి ఈ రాశి వారికి కొంతవరకు మేలు చేయనుంది. చంద్రుడు.. శుక్రుడితో కలవడం శుభ పరిణామాలను సూచిస్తే.. అదే ఇంట్లో రాహువు కూడా ఉండటం వలన  మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది.  బుధుడు వ్యాపారాన్ని విస్తరించచేస్తే.. రాహువు ఆందోళనకర పరిస్థితులు కలుగజేస్తాడు. కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చినట్టు వచ్చి ఆగిపోతాయి.  వ్యాపారస్తులకు నామమాత్రపు లాభాలు మాత్రమే వస్తాయి.  ఖర్చులు పెరుగుతాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి .. అంతా మంచే మంచే జరుగుతుంది. ఎలాంటి నిరాస.. నిస్పృహలకు లోను కావద్దు.

కర్కాటక రాశి:   మీనరాశిలో చంద్రుడు.. రావడం.. పంచగ్రహ కూటమి ఏర్పడం వలన ఈ రాశి వారికి జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది.  కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది.  ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి సక్సెస్​ అవుతారు.  ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది.  ప్రేమ ..పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.  

సింహ రాశి: ఈ రాశి వారికి చంద్రుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి అనేక లాభాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. . కెరీర్​  పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు . వ్యాపారం చేసేవారికి భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అంతా మంచే జరుగుతుంది. 

కన్యారాశి:  ఈ రాశి వారికి మీనరాశిలో  చంద్రుని సంచారం వల్ల లాభపడతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచమయమవుతారు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. నిరుద్యోగులను ఆశించిన జాబ్​ వస్తుంది. 

 తులారాశి: పంచగ్రహకూటమి వలన ఈ రాశి వారు ప్రతికూల ఫలితాలు ఉంటాయి.  అప్పులు చేయాల్పి వస్తుంది.  అయితే ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు పనిభారం.. అవమానాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొత్తపెడుబడులను వాయిదా వేయండి.  ప్రేమ .. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి.  సుందరాకాండ పారాయణం చేయండి ఉపశమనం పొందుతారు. 

వృశ్చికరాశి:  మీన రాశిలో చంద్రుడు ...  బుధుడితో కలవడం వలన ఈరాశి వారికి  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ప్రభుత్వ సహకారంతో, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనస్సురాశి:  మీనరాశిలో పంచగ్రహకూటమి వలర ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతాయి. మీలో మీ రే కూర్చుని పరిష్కరించుకోండి. వేరే వారికి అవకాశం ఇవ్వవద్దు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి  ఇదిమంచి సమయం.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా ఖర్చులు రావడంతో  ఆర్థిక పరంగా కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  ఈ రాశి వారికి పంచగ్రహకూటమి వలన పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.  అనుకోకుండా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్​ వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభరాశి:ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.  ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు  లాభాలు వస్తాయి.  అధికంగా డబ్బు ఖర్చవుతంది.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోతుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు.  హనుమాన్​ చాలీసా పారాయణం చేయండి మాసనిక ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుంది. 

మీనరాశి: ఈ రాశివారికి  అన్ని విధాలా కలసి వస్తుంది.  ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు . కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కార్యాలయంలో మీరే కీలకపాత్ర పోషిస్తారు.  అధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.