కరీంనగర్ హనుమాన్ ఆలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ

ఈ మధ్య హిందూ దేవాలయాలు టార్గెట్ గా  దాడులు కలకలం రేపుతున్నాయి.  లేటెస్ట్ గా  కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది.   తాళం పగలగొట్టి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మీర్ పేటలో 

నవంబర్ 18న  మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.. 

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం  కొందరు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి, గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలను గుడిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో అయ్యప్ప స్వాములు దేవాలయం నుంచి వెళ్లిపోయారు.  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల వద్ద పూజారి తో పాటు వంట పని చేసే వాళ్లు  దేవాలయాన్ని శుభ్రం చేసే వారు నిద్రపోయారు.  ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచేసరికి పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. వెంటనే వారు ఆలయ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు

Also Read :- మీ పిల్లలకు షుగర్ ఉందా లేదా అనేది ఇలా తెలుసుకోండి

శంషాబాద్ లో 

నవంబర్ 5న  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు .  దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు

సికింద్రాబాద్ లో 

అక్టోబర్ 14న  సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు  అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  గర్భగుడి నుంచి విగ్రహాన్ని బయట విసిరేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..