పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం చేశారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ గాజులు, హారతి సమర్పించారు.
అనంతరం ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజినికుమారి, చైర్మన్ మహిపతి రామలింగం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.