ప్రజాశాంతి తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి

ప్రజాశాంతి తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి
  • గెలిచిన గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా
  • ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ.పాల్

ఖమ్మం టౌన్‌‌/మణుగూరు, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీచేసేందుకు క్యాండిడేట్లు ముందుకు రావాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ.పాల్‌‌ పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ తరఫున ఎవరూ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోఉండొద్దని సూచించారు. తమ పార్టీని గెలిపించిన గ్రామాల్లో ఉచితంగా రోడ్లు వేసి, విద్య, వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. 

జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మంత్రులుగా ఉన్నా జిల్లాలో మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. కనీసం రోడ్లు కూడా సరిగా లేవని, నిరుద్యోగం పెరిగిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి సీఎం కావాలని చూస్తున్నారన్నారు. 

పదేండ్ల పాలనలో సర్పంచ్‌‌లకు న్యాయం చేయన కేసీఆర్‌‌.. ఇప్పుడు వారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జమిలి ఎన్నికలపై మాట్లాడిన తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో పర్యటించారు.