లింగంపేట, వెలుగు: శెట్పల్లి గ్రామ ఫీల్డ్అసిస్టెంట్శివరాంను విధుల నుంచి తొలగించాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీస్లో జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాయన్న, ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డిలకు ఫిర్యాదు చేశారు.
ఉఫాది హామీపథకంలో చెరువులో పూడికమట్టి తరలించడానికి రైతుల నుంచి రూ.4,000 లంచం అడిగాడని ఆరోపించారు. గ్రామసభలో సైతం ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్ పద్మరెడ్డి తెలిపారు. జీపీ తీర్మానించిన ప్రకారం విచారణ చేపట్టి, విధుల నుంచి తొలగించాలని కోరారు.