
బాలీవుడ్ సూపర్ హిట్ డ్రామా వెబ్ సిరీస్ 'పంచాయిత్ ' (Panchayat) అందరికీ సుపరిచితమే. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ ఏప్రిల్ 3, 2020న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చి.. నేటితో (ఏప్రిల్ 3, 2025) ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పంచాయితీ నాలుగో సీజన్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ మేరకు ప్రైమ్ వీడియో ఫన్నీ వీడియోతో ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 'పంచాయిత్' సీజన్ 4 జూలై 2,2025న ప్రీమియర్ కానుందని మేకర్స్ తెలిపారు. ఈ వీడియోలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లయిన భూపేంద్ర జోగి, దర్శన్ మగ్దూమ్, ఇతరులతో కలిసి చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంటోంది.
ఇందులో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్ మరియు పంకజ్ ఝా తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ కు దీపక్ కుమార్ మిశ్రా మరియు చందన్ కుమార్ కథను అందించారు. దీపక్ కుమార్ మిశ్రా మరియు అక్షత్ విజయవర్గియా దర్శకత్వం వహించారు.
Hi 👋 Panchayat ke 5 saal hone ki khushi mein party toh banti hai 🎉#PanchayatOnPrime, New Season, July 2#5yearsofPanchayat pic.twitter.com/Zz3sjRLp5p
— prime video IN (@PrimeVideoIN) April 3, 2025
పంచాయిత్ సిరీస్:
ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే కాల్పనిక గ్రామంలో.. పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథను వివరిస్తుంది. ఈ సిరీస్ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఇదొకటి. గత రెండు సీజన్లతో పోలిస్తే పంచాయత్ మూడో సీజన్లో కాస్త కామెడీ తక్కువైపోయింది. పూర్తి కథనమంతా రాజకీయాల చుట్టూ సాగుతుంది.
ఇకపోతే ఇప్పుడు రాబోయే సీజన్ 4 పూర్తిగా పంచాయతీ ఎన్నికలే ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. మూడో సీజన్ ఎండింగ్ లోనే మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో ఫులేరా గ్రామస్తుల గొడవ పెరగటంతో ఆసక్తికరంగా అంశాలతో ముగించి సీజన్ 4పై అంచనాలు పెంచేశారు.
సివరపల్లి:
ఇటీవలే.. హిందీ పంచాయితీ వెబ్ సిరీస్కు తెలుగు రీమేక్ "సివరపల్లి" వచ్చింది. 2025 జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో రాగ్ మయూర్, రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్ సన్నీ పల్లె, ఉదయ్ గుర్రాల పావని కరణం కీ రోల్స్ లో నటించారు.
కంప్లీట్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించారు. నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడంతో నిజంగానే ఓ పల్లె జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ కలిగేలా చేశారు.
కథ:
శ్యామ్ (రాగ్ ముసూర్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివరపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం వస్తుంది. తను మాత్రం తన ఫ్రెండ్స్ లాగే పారిన్ వెళ్లి సెటిల్ కావాలి అనుకుంటాడు. కానీ తండ్రి మాట కాదనలేక ఉద్యోగంలో చేరతాడు. సిపరపల్లి గ్రామానికి సుశీల (రూప లక్ష్మి) సర్పంచ్ కానీ.. సుకీల చేయాల్సినవసులన్నీ ఆమె భర్త సుధాకర్ (మురళీదర్ గౌడ్) చూసుకుంటాడు.
శ్యామ్ ఊరిలోని పంచాయతీ ఆఫీసులోనే ఒక రూమ్ లో ఉంటూ పనిచేస్తుంటాడు. కానీ, ఆ ఊరి వాతావరణం, అక్కడి వాళ్ల తీరు శ్యామ్ కు నచ్చదు. దాంతో సాధ్యమైనంత త్వరగా పారిన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అక్కడివాళ్లు ప్రభుత్వ విధానాల పట్ల బాధ్యతగా లేకపోయినా తాను మాత్రం నిజాయితీగా పనిచేస్తాడు. అప్పుడు అతనికి. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? జీమ్యాట్ ఎగ్జామ్ రాసి అమెరికా వెళ్లిపోవాలనే శ్యామ్ కల తీరిందా? అనేదే మిగతా కథ.