పోడు పట్టాలివ్వలేదని గ్రామపంచాయతీకి తాళం

ధర్పల్లి, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం ధనంబండతండాలో  పోడుభూములకు పట్టాలివ్వలేదని రైతులు గురువారం పంచాయతీ ఆఫీసుకు తాళంవేశారు.  370 మంది రైతులు దరఖాస్తులు చేయగా కేవలం 63 మందికి మాత్రమే పట్టాలిచ్చారని వాపోయారు.  

రెవెన్యూ, ఫారెస్టు ఆఫీసర్లు అవినీతికి పాల్పడి డబ్బులు దండుకుని పట్టాలు  ఇచ్చారని ఆరోపించారు.  తమ పోడు భూములకు పట్టాలివ్వలేదని  నిరసనగా పంచాయతీ ఆఫీసుకు తాళం 
వేసి నట్లు తెలిపారు.