సూర్యాపేట జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికిన వ్యక్తికి పంచాయితీ అధికారులు జరిమానా విధించారు. సూర్యాపేట, ఖమ్మం రహదారి వెంట SRSP కాలువ పక్కనే దాదాపు 150 చెట్లు ఉన్నాయి. అయితే చివ్వెల మండలం సూర్యనాయక్ తండాకు చెందిన భూక్యా బాపు ఆ చెట్లను నరికేశాడు. మార్చి 20న ఈ ఘటన జరిగింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న పంచాయితీ అధికారులు భూక్యా బాపుకు ఆరు లక్షల 64 వేల రూపాయలను జరిమానా విధించారు. ఒక్కో చెట్టుకు 5 వేల చొప్పున జరిమానా విధించినట్టుగా అధికారులు వెల్లడించారు. వారంలోపు జరిమానా కట్టాలని లేనిచో కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
https://www.youtube.com/watch?v=c3-isiD8qHk