ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఏఈ కోసూరి రంగరాజు

సూర్యాపేట జిల్లా పంచాయతీరాజ్​ విభాగం ఏఈ కోసూరి రంగరాజు  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హుజూర్​నగర్​ పంచాయతీరాజ్​ డీఈ కార్యాలయంలో ఏసీబీ దాడి జరిగింది.  రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. హుజూర్​ నగర్​ పంచాయతీరాజ్   ఏఈ కోసూరి రంగరాజు ఎంబీ రికార్డ్ కోసవ రూ 5 వేలు లంచం డిమాండ్​ చేశారు. మేళ్లచెరువు,చింతలపాలెం మండలాల పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు.  మేళ్లచెరువు ,చింతలపాలెం పంచాయతీరాజ్ ఆఫీసులో  ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.  ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది.