83 శాతానికిపైగా ఇంటి పన్ను వసూలు..టాప్ లో సిరిసిల్ల, లాస్ట్ లో అసిఫాబాద్

83 శాతానికిపైగా ఇంటి పన్ను వసూలు..టాప్ లో సిరిసిల్ల, లాస్ట్ లో అసిఫాబాద్
  • రూ.378 కోట్లకు రూ.315 కోట్లు సేకరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 83.17 శాతం  ఇంటి పన్ను వసూలైందని పంచాయతీ రాజ్  శాఖ అధికారులు తెలిపారు. మొత్తం  రూ.378 కోట్లకు రూ.315 కోట్లు వసూలైంది. ఇంటి పన్ను వసూలులో టాప్ 5లో సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు చివర్లో ఉన్నాయి. ఇంటి పన్ను వసూలుపై సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. పన్ను బకాయిలపై  ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.