ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : మంత్రి సీతక్క

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : మంత్రి సీతక్క
  • పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్క

ములుగు/ తాడ్వాయి/ మంగపేట, వెలుగు: కంప్యూటర్​ విద్యను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులతో కలసి మంత్రి కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా అల్పాహారం చేశారు. అనంతరం 15 కంప్యూటర్లతో ల్యాబ్ ను ప్రారంభించి, విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 

జగతి ఫౌండేషన్, స్వచ్ఛంద సేవా సంస్థ వారు గిరిజన విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యను నేర్చుకోవాలని ఉద్దేశంతో ఆశ్రమం పాఠశాలకు 15 కంప్యూటర్ లు అందించారని మంత్రి తెలిపారు.  అంతకుముందు మంత్రి ములుగు మండలం జంగాలపల్లి, మంగపేట మండలం కమలాపురం, మంగపేట గ్రామాల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం కమలాపురం దళిత వాడలో రోడ్ పనులు ప్రారంభించారు. మంగపేటలో షాదీముబారక్ చెక్కులు అందించి, తెలంగాణ సెంటర్​లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ప్రారంభించారు.