గురుకులాల్లో జరిగే కుట్రలు బయటపెడ్తం: మంత్రి సీతక్క

గురుకులాల్లో జరిగే  కుట్రలు బయటపెడ్తం: మంత్రి సీతక్క
  • త్వరలోనే అన్నీ వెలుగులోకి వస్తాయ్
  • రాజకీయ దురుద్దేశంతోనే సర్కారును బద్నాం చేస్తుండ్రు
  • ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వమే
  • తలసాని కుమారుడితోపాటు 10 మంది డైరెక్టర్లున్నరు
  • రెచ్చగొట్టే వైఖరిని బీఆర్ఎస్ అవలంబిస్తోంది
  • యూట్యూబ్ చానళ్లలో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం
  • పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్: గురుకులాల్లో  జరిగే కుట్రలన్నీ త్వరలోనే బయటపెడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అన్నీ వెలుగులోకి వస్తాయన చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే సర్కారును బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

 నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, పర్మిషన్ పత్రాలపై కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయని చెప్పారు. అనుమతి ఎవరిచ్చారో అనే అంశంపై బీఆర్ఎస్ నాయకులు సిద్ధం కావాలన్నారు. 

ఈ పరిశ్రమకు మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్​ యాదవ్ తో పాటు మరో 10 మంది డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు. 

ఆనాడు గ్రామ సభలు అవసరం లేదని బీజేపీ సపోర్ట్ చేసిందని చెప్పారు. తప్పుడు ప్రచారాలో మనుగడ సాధించలేరని అన్నారు. యూట్యూబ్ చానళ్లలో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఇథనాల్ పరిశ్రమ వివాదంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని అన్నారు.