
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సోమవారం వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ లోని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ కార్యాలయంలో వర్క్‌షాప్ జరుగుతుందని పీఆర్, ఆర్ డీ డైరెక్టర్ సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటలకు వర్క్‌షాప్ ప్రారంభం కానున్నది. జడ్పీ సీఈవో, డీఆర్డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు విధిగా హాజరుకావాలని కోరారు. ఈ వర్క్‌షాప్‌కు మంత్రి సీతక్క హాజరవుతారని సమాచారం. గ్రామాల అభివృద్ధి, ఉపాధి పనులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.