శంకరపట్నం, వెలుగు : తాటికల్ గ్రామంలో సోమవారం చిరు వ్యాపారుల టేలలను పంచాయతీ కార్యదర్శులు జేసీబీతో తొలగించారు. టేలలను తొలగించాలని నోటీసులు జారీ చేసి, నెల రోజులవుతున్నా.. తొలగించకపోవడంతో ఆదివారం సాయంత్రం గ్రామంలో దండోరా వేయించారు.
ఎంపీఓ బషీరుద్దీన్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు జేసీబీలతో టేలాలు తొలగిస్తుండగా చిరు వ్యాపారులు అడ్డుకొని ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.నోటీసులు ఇచ్చినా టేలాలు తొలగించుకోలేదని, అధికారులు వాటిని తీసేశారు.