పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వాలి : మధుసూదన్​ రెడ్డి

పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వాలి : మధుసూదన్​ రెడ్డి
  • ఓపీఎస్​లను జేపీఎస్​లుగా గుర్తించాలి : మధుసూదన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ  కార్యదర్శుల సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులరైజేషన్​ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుంచి రెండేండ్లకు తగ్గించి.. వారికి ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఔట్​ సోర్సింగ్​ ద్వారా పంచాయతీ కార్యదర్శల నియామకాలను రద్దు చేయాలని, ప్రస్తుతం ఔట్​ సోర్సింగ్​ విధానంలో కొనసాగుతున్న కార్యదర్శులను జూనియర్​ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాలని కోరారు.

వారి సర్వీసు కాలాన్ని జూనియర్​ పంచాయతీ కార్యదర్శి  (జేపీఎస్​) సర్వీసుగా పరిగణించాలని కోరారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలను గ్రేడ్​ –1, 2, 3, 4 గా పునర్​ వ్యవస్థీకరించాలన్నారు.

జీవో నం 317 ద్వారా నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులను తిరిగి వారి సొంత జిల్లా,  జోన్లకు పంపించాలని డిమాండ్​ చేశారు. పంచాయతీ రాజ్​ చట్టం –2018 లో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన సెక్షన్లలో సవరణలు చేయాలని మధుసూదన్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.