పంచాయతీ సెక్రటరీపై మల్టీ పర్పస్ వర్కర్ దాడి

పెనుబల్లి , వెలుగు  :  మండల కేంద్రంలోని మండలాపాడు పంచాయతీ సెక్రటరీపై అదే పంచాయతీలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ దాడి చేశాడు. కేసు నమోదైంది. వీఎం బంజరు ఎస్సై కే.వెంకటేశ్​ తెలిపిన వివరాల ప్రకారం..  మండాలపాడు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న కామిశెట్టి నరసింహరావు సోమవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో పనిలో ఉన్నాడు. 

అదే గ్రామానికి చెందిన పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తడికమళ్ల మన్మధరావు తనను ఎందుకు పనిలోకి రావోదంటున్నారంటూ తిడుతూ తన స్కూటీని కాళ్లతో తన్ని కింద పడేశాడని, తన విధులకు ఆటంకం కలిగించాడని సెక్రటరీ మంగళవారం వీఎం బంజరు పోలీస్​స్టేషన్​లో  ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.