
- ఎంపీపీకి పంచాయతీ కార్యదర్శుల ఫిర్యాదు
చేర్యాల, వెలుగు: చేర్యాల ఎంపీడీవో తమకు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులు సర్పంచులు చేయకపోతే సెక్రటరీలు సొంత డబ్బులతో చేయాలని ఎంపీడీవో వేధిస్తున్నారని, లేదంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నారని వాపోయారు. ఇలా అయితే ఈ మండలంలో పనిచేయలేమని మరో మండలానికి బదిలీ చేయాలని కోరారు. ఈ విషయంపై ఎంపీడీవో తారిక్ అన్వర్‌ను వివరణ కోరగా.. తాను ఎవరినీ వేధిచంలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు స్పీడప్ చేయాలని మాత్రమే కోరానని తెలిపారు.