అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న పంచాయతీ సెక్రటరీని ఎసిబి పట్టుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ సెక్రటరీ కిరణ్.. ఇంటి పర్మిషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.5వేలు లంచం ఇచ్చాడు.
అయితే, మరింత లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలో పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. బాధితుడి నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా కిరణ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకు కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.