సెక్రటేరియేట్ వద్ద పంచాయతీ కార్యదర్శి అభ్యర్ధుల ఆందోళన

సెక్రటేరియేట్ వద్ద పంచాయతీ కార్యదర్శి అభ్యర్ధుల ఆందోళన

పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సెలక్టయిన అభ్యర్ధులు సోమవారం సెక్రటేరియేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పంచాయతీ రాజ్  ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసేందుకు వచ్చిన అభ్యర్ధులను సెక్రటేరియేట్ మెయిన్ గేట్ వద్ద సిబ్బంది వారిని అనుమతించకపోవటంతో వారు ఆందోళనకు దిగారు.

నాన్ లోకల్ పేరుతో తమకు అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారులు చెబుతున్న ప్రకారం తాము నాన్ లోకల్ అయినప్పుడు ఇంటర్వ్యూకు ఎందుకు పిలిచారు?  సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారు?  అని ప్రశ్నించారు. ఆన్ లైన్ లో  పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఎలా ఓకే చేసిందనే విషయాలపై పంచాయతీ రాజ్ అధికారూలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి  చెందిన తాము తెలంగాణలోనే ఎలా నాన్ లోకల్ అవుతామని తమ ఆవేదన వ్యక్తం చేశారు.  పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు కొత్త జిల్లాల ప్రకారమే పోస్ట్ ల భర్తీ అని 124 జివో ఇవ్వడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. సెలక్టయిన అభ్యర్ధులంతా 800 మంది ఉన్నారని, వారి సమస్యను ప్రభుత్వమే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.